Tuesday, May 6, 2025
- Advertisement -

త‌మిళ‌నాడులో డిసెంబ‌ర్ 31వ తేదీ ఏమ‌వుతుంది?

- Advertisement -

ఆరు రోజుల పాటు అభినుమాల‌తో ర‌జ‌నీకాంత్

దేవుడు శాసిస్తే రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని త‌మిళుల‌ అభిమాన న‌టుడు త‌లైవా ర‌జ‌నీకాంత్ ప్ర‌క‌టించారు. ‘యుద్ధం వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందాం అని అభిమానుల‌కు పిలుపునిచ్చాడు. తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చేది లేనిది, ఏ నిర్ణ‌య‌మైనా డిసెంబ‌ర్ 31వ తేదీన చెబుతాన‌ని తెలిపారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మంగళవారం చెన్నైలోని రాఘవేంద్ర మండపంలో అభిమానులతో సమావేశమయ్యారు. డిసెంబ‌ర్ 26 నుంచి 31వ తేదీ వరకు వారం రోజుల పాటు అభిమానులతో సమావేశాలు కొన‌సాగ‌నున్నాయి. త‌న రాజకీయ రంగ ప్రవేశం కోసం ఇలా అభిమానుల‌తో స‌మావేశం అవుతున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే త‌మిళ‌నాడులో మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు ఆ విధంగానే క‌నిపిస్తున్నాయి. మొన్న ఆర్‌కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో శ‌శిక‌ళ మేన‌ల్లుడు దిన‌క‌ర‌న్ స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా విజ‌యం సాధించ‌డం ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల‌కు షాక్ త‌గిలింది. ఇక మ‌ళ్లీ శ‌శిక‌ళ వ‌ర్గం విజృంభిస్తుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ర‌జ‌నీ అభిమానుల‌తో స‌మావేశం కావ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆందోళ‌న మొద‌లైంది.

ఇక స‌మావేశం ర‌జ‌నీకాంత్ మాట్లాడుతూ.. నా ఉద్దేశంలో యుద్ధం అంటే ఎన్నిక‌లు. ఎన్నిక‌లు ఇంకా రాలేదు క‌దా? ’ అన్నారు. మిమ్మల్ని మళ్లీ కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. రాజకీయ విషయంలో నేను తీసుకునే నిర్ణయం ప్రజలకు ఎంతవరకు మేలు చేస్తుంది అని బాగా ఆలోచించాలి. నాకు రాజకీయాలు కొత్తేం కాదు. కాకపోతే ఆలస్యమైందంతే. రాజకీయాల్లోకి రావడం అంటే విజయం సాధించేసినట్లే. ఏ విషయమైనా డిసెంబర్ 31వ తేదీన ప్రకటిస్తా. నేను రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని చెప్ప‌డం లేదు అని అభిమానుల‌తో పంచుకున్నారు. 2017 మే నెలలో తన రాజకీయ రంగప్రవేశం గురించి రజనీ నోరు విప్పారు. ‘దేవుడు శాసిస్తే రేపే రాజకీయాల్లోకి వస్తాను’ అని ప్ర‌క‌టించారు. మ‌ళ్లీ ఇటీవ‌ల ర‌జ‌నీ రాజ‌కీయ ప్ర‌వేశం గురించి స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -