Thursday, May 2, 2024
- Advertisement -

రాజకీయాల్లోకి మరో తమిళ టాప్ హీరో..!

- Advertisement -

అవును మీరు వింటున్నది నిజమే, తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్త తాజాగా మీడియా సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. విజయ్ నేరుగా రాజకీయాల్లోకి వస్తానని చెప్పనప్పటికీ, తరచుగా తన నోటినుంచి వినిపిస్తున్న పదాలు రాజకీయాలు, ఓటింగ్. అంతే కాదు తన సినిమాలలో కూడా రాజకీయాల పై పంఛ్ డైలాగులు వినిపిస్తుంటాయి. మరొ పక్క ఇటీవలి విద్యార్థుల సమావేశంలో ప్రస్తుత రాజకీయ పార్టీలు ఎలా పనిచేస్తాయో విద్యార్థులతో పంచుకున్నాడు. నాయకుల ఎంపికల పట్ల జాగ్రత్తగా ఉండాలని మొదటిసారి ఓటర్లను హెచ్చరించాడు.

విద్యార్థులే రేపటి ఓటర్లు.. భవిష్యత్ నాయకులను ఎన్నుకునేవారు. ఓట్ల కోసం డబ్బు తీసుకుంటు మన చేతులతో మన కళ్లను మనమే పోడుచుకుంటున్నాం. ఇందుకు వ్యతిరేకంగా వుండాలని విద్యార్థులను హెచ్చరించారు. 1.5 లక్షల మంది ఓటర్లు ఉన్న నియోజకవర్గంలో ఓటరుకు రాజకీయ నాయకుడు రూ. 1000 ఇస్తున్నారు అంటే దాదాపు 15 కోట్లు లంచంగా ఇస్తున్నట్టు. ఓ వ్యక్తి రూ.15 కోట్లు లంచం ఇస్తే అంతకు ముందు ఎంత సంపాదించాడో ఒక్కసారి ఆలోచించండి!. ఇవన్నీ మీ విద్యా విధానంలో భాగం కావాలని కోరుకుంటున్నాను. మీరు వెళ్లి మీ తల్లిదండ్రులకు ఓటు వేయడానికి డబ్బు తీసుకోవద్దని చెబితే మార్పు వస్తుంది.

విజయ్ అభిమానుల సంఘం ఆల్ ఇండియన్ తలపతి విజయ్ మక్కల్ ఇయక్కం నిర్వహించిన 10, 12 తరగతులకు సన్మాన కార్యక్రమం లో యువ విద్యార్థులతో ముచ్చటించారు. స్టార్ అనే ఆటిట్యూడ్ లేకుండా స్టూడెంట్స్‌తో కలిసి కూర్చున్నాడు మరియు అతని సింప్లిసిటీని అభిమానులు ప్రశంసించారు. ప్రత్యేక కార్యక్రమానికి పసుపు రంగు చొక్కా మరియు జీన్స్ ధరించాడు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

విజయ్ తండ్రి ప్రముఖ నటుడు/దర్శకుడు SA చంద్రశేఖర్ ఆల్ ఇండియా తలపతి విజయ్ మక్కల్ ఇయక్కం అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు, అతనితో జనరల్ సెక్రటరీగా మరియు తల్లి శోభా చంద్రశేఖర్ కోశాధికారిగా ఉన్నారు. ఆ తర్వాత పార్టీ సంక్షేమ సంస్థగా మారి తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేసి విజయం సాధించింది. నటుడు పార్టీ సభ్యులతో ముఖాముఖిగా సమావేశమయ్యారు, 115 సీట్లు గెలుచుకున్నందుకు వారిని అభినందించారు.

మొత్తమ్మీద, తలపతి విజయ్ సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి ప్రవేశించి 2026 ఎన్నికలలో పోటీ చేస్తారని తమిళ సర్కిల్‌ల్లో హాట్ టాపిక్ అయింది. అయితే దీనిపై విజయ్ లేదా PR బృందం స్పందించాల్సి ఉంది. అప్పుటి వరకు ఇది పుకారు మాత్రమే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -