తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా విడుదల అవుతుంటే సాఫ్ట్‌వేర్ కంపెనీలు సైతం సెలవులు ప్రకటించేయి. అయితే గత కొంతకాలంగా రజనీ మానియా తగ్గిందనే చెప్పాలి.ఇటీవల ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అవుతున్నాయి. 2.0 మాత్రం హిట్ కొట్టాడు రజినీ. రజనీకాంత్ తాజాగా నటించిన చిత్రం పేటా. 2.0 తరువాత రజినీకాంత్ నటించిన చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.తెలుగులో భారీ చిత్రాలు బరిలో ఉండటంతో పేటకు సరైన స్థాయిలో థియేటర్లు దక్కలేదు. రజినీ సరసన సిమ్రాన్,త్రిష హీరోయిన్లుగా నటించారు. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ రోజే (గురువారం) విడుదల అయింది.మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కథ :
కాళీ (రజనీకాంత్) ఓ హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తుంటాడు. అక్కడే ప్రాణిక్ హీలర్‌గా పనిచేసే డాక్టర్(సిమ్రన్)తో కాళీకి పరిచయం అవుతుంది. అంతా సరదాగా గడిచిపోతున్న సమయంలో కాళీకి లోకల్ గూండాతో గొడవ అవుతుంది. ఆ గొడవ కారణంగా కాళీ అసలు పేరు పేట అని, అతను ఉత్తరప్రదేశ్ నుంచి అక్కడకు వచ్చాడని తెలుస్తోంది. అసలు పేట, కాళీగా ఎందుకు మారాడు..? సింహాచలం(నవాజుద్ధీన్ సిద్ధిఖీ)కు, పేటకు మధ్య గొడవ ఏంటి.? పేట తిరిగి ఉత్తరప్రదేశ్ వెళ్లాడా.. లేదా..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
ఎప్పటిలాగే రజినీకాంత్ సినిమాను ఇరగకొట్టేశాడు. రజనీకాంత్ మరోసారి తనదైన స్టైలిష్, మాస్ యాక్షన్‌తో ఆకట్టుకున్నాడు. పెద్దగా పర్ఫామెన్స్‌కు అవకాశం లేకపోయినా.. అభిమానులను అలరించే స్టైల్స్‌కు మాత్రం కొదవేలేదు.విలన్ పాత్రలను బలంగా తీర్చి దిద్దకపోవటంతో విజయ్ సేతుపతి, నవాజుద్ధిన్ సిద్ధిఖీ లాంటి నటులు ఉన్నా ఆ పాత్రలు గుర్తుండిపోయేలా లేవు. సినిమా అంతా రజనీ వన్‌మేన్ షోలా సాగటంతో ఇతర పాత్రలు గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు.
విశ్లేషణ :
పేట పక్కా కమర్షియల్ ఫార్ములాతో తెరకెక్కిన సినిమా. రజనీ గతంలో ఇలాంటి సినిమాలు చేశాడు. అయితే మరోసారి అదే ఫార్ములాకు రజనీ స్టైల్‌ను జోడించి తెరకెక్కించాడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. తొలి భాగానికి ఇంట్రస్టింగ్ ట్విస్ట్‌లతో నడిపించిన కార్తీక్, ద్వితియార్థంలో కాస్త తడబడ్డాడు. రజనీ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని తయారు చేసుకున్న కథలో పెద్దగా కొత్తదనమేమీ లేదు అనిరుధ్ అందించిన పాటలు తమిళ ప్రేక్షకులను అలరించినా తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకోవటం కష్టమే. నేపథ్య సంగీతం మాత్రం సూపర్బ్ అనిపిస్తుంది. తిరు సినిమాటోగ్రఫి సినిమాకు రిచ్ లుక్ తీసుకువచ్చింది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
బోటమ్ లైన్:
మళ్లీ దెబ్బ కొట్టన రజినీ
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’