Monday, May 6, 2024
- Advertisement -

రాజుగారి గది 2 సెన్సార్ టాక్ ఇదే

- Advertisement -

అక్కినేని నాగార్జున ప్రస్తుతం రాజుగారి గది 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. నాగ్ తన కెరీర్ లో ఫస్ట్ టైం హర్రర్ నేపథ్యంలో ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల 13న రిలీజ్ కు రెడీ కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా సంబంధించిన సెన్సార్ తాజాగా కంప్లీట్ అయ్యింది.

హర్రర్ కామెడీ నేపథ్యంలో ఉన్న ఈ సినిమా U/A సర్టిఫికెట్ అందుకుంది. అయితే సినిమా కామెడీ తరహాలోనే కాకుండా ఇప్పటివరకు ఎవ్వరి చూడని ఒక ఎమోషనల్ హర్రర్ తరహాలో ఉంటుందని సెన్సార్ సభ్యులు అంటున్నారు. ఇప్పటికే ట్రైలర్ తో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు సెన్సార్ సభ్యుల మెప్పు కూడా పొందడంతో చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉంది.

సమంత ఈ మూవీలో ఒక ఆత్మగా భయపెడుతూనే భావోద్వేగానికి గురి చేస్తుందని అంటున్నారు. ఇక ఫస్ట్ ఆఫ్ లో షకలక శంకర్, వెన్నెల కిషోర్ గ్యాంగ్ కామెడీ హైలెట్ గా ఉంటుందట. నాగార్జున ఎంట్రీతో సినిమా మరి ఇంట్రెస్టింగ్ సాగుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకి థమన్ అందించిన మ్యూజిక్ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లిందని చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -