Tuesday, April 30, 2024
- Advertisement -

ర‌కుల్ స్పీడ్‌కు సెన్సార్ బ్రేకులు..

- Advertisement -

అందాల భామ ర‌కుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌లో మ‌రో సారి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకొనేందుకు సిద్ద‌మ‌య్యింది. ఇప్పటికే బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సీనియర్ హీరో అజయ్‌ దేవగన్‌కు జోడిగా దే దే ప్యార్‌ దే సినిమాలో నటిస్తున్నారు. .టబు చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది .

ఇటీవ‌ల చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌గా, దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అజ‌య్ ప్రియురాలిగా ర‌కుల్ అద‌రగొట్ట‌గా, ఆయ‌న మాజీ భార్య‌గా ట‌బు న‌టించారు. ప్ర‌మోష‌న్‌లో భాగంగా చిత్రానికి సంబంధించి ‘వడ్డీ షరాబన్‌..’ అనే పాట విడుద‌ల చేశారు. ఈ పాటలో రకుల్.. చేతిలో మందు బాటిల్ పట్టుకొని తాగుతూ పంజాబీ స్టైల్‌లో ఆడుతూ.. పాడుతూ రచ్చ చేసింది. ఈ పాట‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే విస్కీ బాటిల్ ప‌ట్టుకొని ర‌కుల్ డ్యాన్స్ చేయ‌డంపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) ఆ సీన్‌కి క‌త్తెరేసింది. ఆ సీన్‌ను కట్ చేయటం లేదా..? బాటిల్‌ కు బదులుగా పూలు పట్టుకున్నట్టుగా గ్రాఫిక్స్‌ చేయాలని సూచించారు. మరికొన్ని కట్స్‌తో సినిమాకు యు/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -