Friday, May 3, 2024
- Advertisement -

లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి టైం లేదంటున్న రకుల్ ప్రీత్

- Advertisement -

‘స్పైడర్’ సినిమా తో డిజాస్టర్ అందుకున్న రకుల్ ప్రీత్ కొన్నాళ్ళు తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉండి తమిళ్ మరియు హిందీ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తాజాగా నాగార్జున హీరోగా నటిస్తున్న ‘మన్మధుడు 2’ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈమె ఇప్పటిదాకా కేవలం కమర్షియల్ సినిమాలలోనే నటించిన సంగతి తెలిసిందే. అయితే అనుష్క, నయనతార వంటి హీరోయిన్ లు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హీరోయిన్ల జాబితాలో ఈ మధ్య సమంత కూడా చేరిపోయింది. మరి రకుల్ ప్రీత్ ఇలాంటి సినిమాలలో నటిస్తుందా అని ప్రశ్నని ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో ఈమె ఎదుర్కొంది.

అయితే తనకి కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో చేయాలని ఆలోచన ఉన్నప్పటికీ అలాంటి పాత్రలు రావాలి కదా అని చెప్పింది అంతేకాకుండా కమర్షియల్ సినిమాలలో కూడా హీరోయిన్ పాత్రకి ప్రాధాన్యత ఇస్తే అది కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమా అవుతుంది అని చెప్పుకోచ్చింది రకుల్ ప్రీత్. పైగా సంవత్సరానికి ఉన్న 365 రోజుల్లో అన్ని రకాల పాత్రలు అన్ని రకాల సినిమాలు చేయడానికి తనకు టైం కూడా సరిపోవడం లేదని చెప్పింది రకుల్. ఇక ఈమె నటించిన ‘మన్మధుడు 2’ సినిమా ఆగస్టు 9న విడుదల కాబోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -