Friday, March 29, 2024
- Advertisement -

రకుల్ తో తమిళ హీరో ప్రేమాయణం..

- Advertisement -

కమలహాసన్ కెరియర్లో మర్చిపోలేని సినిమాలలో ‘భారతీయుడు’ కూడా ఒకటి. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లోనే బ్లాక్బస్టర్ గా మారింది. మళ్ళీ ఇన్నాళ్ళకు ఈ సినిమా సీక్వెల్ తో శంకర్ మరియు కమల్ హాసన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘భారతీయుడు 2’ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా శంకర్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం హీరో సిద్ధార్థ్ ని ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తన జోడిగా మరో హీరోయిన్ ని రంగంలోకి దింపారు.

ఆమే రకుల్ ప్రీత్. హీరో సిద్దార్థ్ పాత్ర కి జోడిగా రకుల్ సిద్ధు తో రొమాన్స్ చేయనుంది. ‘భారతీయుడు’ సినిమాలో కమల్ హాసన్ తండ్రి మరియు కొడుకు గా కనిపించిన సంగతి తెలిసిందే. అందులో కొడుకు పాత్ర మనిషా కొయిరాల తో ప్రేమలో పడుతుంది. అదేవిధంగా ‘భారతీయుడు 2’ లో కూడా సిద్ధార్థ మరియు రకుల్ మధ్య లవ్ స్టోరీ నడుస్తుందని, అది ఈ సినిమాకి హైలైట్ అవుతుందని సమాచారం. ఇంకా తెలుగు తమిళంలోనే కాక ‘భారతీయుడు 2’ సినిమాని బాలీవుడ్లో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -