Sunday, May 5, 2024
- Advertisement -

వీర రాఘవ రెడ్డి నటనకు చిట్టిబాబు ఫిదా..!

- Advertisement -

ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఎమోషనల్ చిత్రం అరవింద సమేత పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నాలుగురోజుల్లోనే చిత్రం 100 కోట్ల గ్రాస్ ను దాటేసి చిత్ర యూనిట్ కి సంతోషాన్ని ఇచ్చింది.ఈ సినిమాపై ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌శంశ‌లు వ‌ర్షం కురిపించారు.

అక్టోబర్ 11న విడుదలైన ఈ మూవీ రికార్డ్ కలెక్షన్ల‌తో నాన్ బాహుబలి రికార్డ్స్‌ను బ్రేక్ చేసి సన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఎన్టీఆర్ కెరియర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌తో పాటు విడుదలైన మూడో రోజునే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త రికార్డుల్ని నమోదుచేసింది.

దర్శకధీరుడు రాజమౌళి, జై లవకుశ దర్శకుడు బాబీ, మెగా హీరో సాయి ధరమ్ తేజ్, నిఖిల్, నితిన్‌, అఖిల్ లతో పాటు టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు ఎన్టీఆర్ నటనకు ఫిదా అవుతూ ట్విట్టర్ ద్వారా చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా రంగస్థలం చిట్టిబాబు.. వీర రాఘవ నటనకు ఫిదా అయ్యా అంటూ ట్వీట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -