రామ్ చరణ్ గురించి గతంలో కొందరు మార్కెట్లో ఒక రకమైన అభిప్రాయాన్ని క్రియేట్ చేశారు.
దాంతో అతను ఎంత చేసినా, ఏం చేసినా..తన చిత్రాలతో వచ్చిన ఇమేజ్ తో అతను కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైపోయాడు. కాని తాజాగా చెర్రీ విధానంలో చాలా మార్పు చూసామని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఎవ్వరికైనా ఒక ఏజ్ వచ్చాక సహజంగా వచ్చే మానసిక పరిపక్వత అతన్ని ఎంతగానో హుందాగా ప్రవర్తించేలా చేస్తోంది.
అదే యాంగిల్లో చెర్రీ కూడా ఇపుడు బిహేవ్ చేసినట్లుగా కోన వెంకట్ మాటల బట్టి తెలుస్తోంది. బ్రూస్ లీ ఆడియో లాంచ్ లో అతను ఇదే విషయంపై వివరణ ఇచ్చాడు.బద్ద శత్రువులుగా ఉన్న శ్రీనువైట్లను మమ్మల్ని(కోన వెంకట్ ,గోపీ మోహణ్ )చెర్రీ కలిపాడని ఒక మంచి కోసం మార్పు కంటే పర్సనల్ ఇగోస్ ఏవి అంత గొప్పవి కాదని చరణ్ చెప్పడంతో తాము కలిసామని చెప్పాడు.
ఇదనే కాకుండా రీసెంట్ గా చరణ్ వే ఆఫ్ బిహేవియర్ చూసిన వారెవరికైనా చరణ్ ఎంత మెర్చూర్డ్ గా ఆలోచించేది అర్థమవుతుంది.