Friday, April 26, 2024
- Advertisement -

బైడెన్ ట్విట్టర్ ఖాతాలో మార్పు..!

- Advertisement -

అమెరికా 46వ అధ్యక్షునిగా జో బైడెన్​ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వెంటనే నూతన పాలక వర్గానికి సంబంధించిన అన్ని ట్విట్టర్​ ఖాతాలను ఆ సంస్థ​ అధికారికంగా బదిలీ చేసింది. నిన్నటి వరకు ప్రెసిడెంట్​ ఎలక్ట్​గా ఉన్న బైడెన్ ఖాతా(@PresElectBiden) ఇప్పుడు పోటస్​గా(@POTUS) మారిపోయింది. అలాగే వైస్​ ప్రెసిడెంట్​, వైట్​హౌస్​, ఫ్లోటస్​ల అధికారిక ఖాతాలు బదిలీ అయ్యాయి.

POTUS​ అంటే.. అమెరికా అధ్యక్షుడికి సంక్షిప్త రూపం. FLOTUS​ అంటే అమెరికా తొలిమహిళ అని అర్థం.ట్విట్టర్​లోని ఈ ఖాతాలన్నీ ఏ ఒక్క వ్యక్తికీ శాశ్వతంగా ఉండవు. ప్రభుత్వం మారినప్పుడల్లా ఈ ఖాతాలూ మారుతూ ఉంటాయి.

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్​కు చెందిన @POTUS ​ ఖాతా ఇకపై @POTUS45 గా మారనుంది. అంతకుముందు ఒబామా పదవీకాలం ముగిసిన అనంతరం.. ఆయన వినియోగించిన ఖాతాను POTUS44 గా మార్చేసింది ట్విట్టర్​.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -