మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్ తక్కువ కాలంలోనే మెగా వారసుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.మగధీర సినిమాతో తెలుగు ఇండస్ట్రీ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు రామ్ చరణ్.అయితే కెరీర్ స్టార్టింగ్‌లో చరణ్ మాటలు చిన్న పిల్లలను గుర్తుకు చేయడంతో పాటు తీవ్ర విమర్శల పాలైయ్యాడు.పబ్లిక్‌లో యువకులతో గొడవ మొదలు మీడియాను సైతం నా వెంట్రుక కూడా ఊడదు మీ ఇష్టం వచ్చింది రాసుకోండి అనే వరకు వెళ్లాడు.
ఇక తెలుగు దర్శకులను కించపరిచేలా చరణ్ మాట్లాడిన విధానంపై సీనియర్ హీరో బాలకృష్ణ సైతం వార్నింగ్ ఇచ్చేంత వరకు వెళ్లింది.ఓ సినిమా ఈవెంట్‌లో మాట్లాడుతు ఏఆర్ మురుగదాస్ వంటి దర్శకులు తెలుగులో లేరని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.తనతో పాటు ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన రాజమౌళిని సైతం కించపరిచేలా రామ్ చరణ్ మాట్లాడటంపై పలువురు సినీ ప్రముఖులు సైతం రామ్ చరణ్‌ను వ్యహారాశైలిని తప్పు పట్టారు.ఆ తరువాత చిరంజీవి ఏం చెప్పారో తెలియదు, కాని రామ్ చరణ్‌లో చాలా మార్పు కనిపించింది.పలు సినిమా ఫంక్షన్లుకు వచ్చి చాలా హుందాగా ప్రవర్తించాడు.అయితే తనలోని పాత మనిషిని లేపినట్లున్నాడు రామ్ చరణ్.నిన్న(మంగళవారం) వరుణ్ తేజ్ హీరోగా నటించిన అంతరిక్షం ఆడియో ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చాడు రామ్ చరణ్.
ఈ ఫంక్షన్‌లో మాట్లాడుతు తెలుగు ఇండస్ట్రీలో గొప్ప ఆలోచనలతో కూడిన దర్శకుడు రాజమౌళి, సుకుమార్, క్రిష్ అని అన్నాడు. అలాంటి కోవలోకే అంతరిక్షం డైరెక్టర్ సంకల్ప్ రావాలని కోరుకున్నాడు.అంటే తనకు నచ్చిన దర్శకుల పేర్లు చెప్పడం, మిగిలిన దర్శకులను కించపరచడం లాంటిదే అని అంటున్నారు నెటిజన్లు.ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న వినయ విధేయ రామ సినిమా డైరెక్టర్ బోయపాటిని సైతం రామ్ చరణ్ అవమానించారని అంటున్నారు.ఇక తాను నటించబోతున్నాడు కాబట్టి రాజమౌళి పేరు చెప్పాడు , కాని లేకపోతే తనకు హిట్ ఇచ్చిన సుకుమార్ ఒక్కడే తెలుగు ఇండస్ట్రీలో గొప్ప దర్శకుడు అని చెప్పేవాడని అంటున్నారు సినీ అభిమానులు.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!