యంగ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సైతం సోషల్ మీడియాలో తన డబ్బా తాను కొట్టుకోవాలని డిసైడ్ అయ్యాడు. మరీ సత్తెకాలపు సత్తెయ్యలాగ ఉంటే కుదరదని..స్పీడ్ భాగా పెంచాడు. బన్నీ అంత కాకపోయినా కాస్తలో కాస్త కటింగ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. అందుకే రంగస్థలం 1985 సినిమా రెట్రోలుక్ ను మనకు అందించాడు.
వర్కింగ్ స్టిల్ లో మన అబ్బాయిగారు విలేజ్ కార్నివాల్ లోకి ఎంట్రీ ఇచ్చిన దాఖలాలు కనిపిస్తున్నాయి. వర్కింగ్ స్టిల్స్ లో కర్నూలుకు చెందిన నందిపైపులు స్టాల్ కనిపిస్తుంది. అంటే సీమ నేపద్యంలో జరిగే ఫైటింగ్ నే చూపిస్తున్నాడని అర్ధమైంది. లేదంటే మన చెర్రీ బాబు సీమకెళితే అక్కడ జరిగిన సీన్ అనుకోవాలో మనకు మనమే స్టోరీని ఓ ఊహించుకోవల్సి ఉంటుంది.

ఇక్కడ వర్కింగ్ స్టిల్ చూశాక ఏం అర్ధమవుతుంది అంటే.. కలర్ కంపోస్ట్ చేసిన మంచి స్టిల్ నైతే వదిలారు. అది కూడా మన చెర్రీబాబును బ్యాక్ సైడ్ నుంచి కవర్ చేస్తూ తీసిన పిక్. ఇందుల్లో చరణ్ రంగులరాట్నం వైపు వెళ్లడం అతని పక్కనే గుర్రపుబండి ఆగడం లాంటి చిత్రాలు చూస్తుంటే.. సుకుమార్ కశ్చితంగా సినిమాను ఏదో ఊహాలోకానికి తీసుకుపోతున్నట్లుగా ఉంది.
https://www.youtube.com/watch?v=0i0ANScZof8