Wednesday, April 24, 2024
- Advertisement -

హీరోగా దేవిశ్రీ ప్రసాద్ అరంగేట్రం..!

- Advertisement -

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ తెలుగు సినిమా అగ్ర సంగీత దర్శకుల్లో ఒకరు. దేవిశ్రీప్రసాద్ హీరోగా పరిచయం అవుతాడు అంటూ తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను నటి చార్మి నిర్మిస్తుందని సమాచారం. కాగా దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడు అంటూ వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. సుమారు పదేళ్ల కిందట నుంచి ఇటువంటి వార్తలు వస్తున్నాయి. హీరో కాదగిన అన్ని లక్షణాలు దేవిశ్రీ లో ఉన్నాయి.

ఆయన సంగీతం అందించిన సినిమాల ఆడియో ఫంక్షన్ల సందర్భంగా ఆయన వేసే స్టెప్పులు హుషారుగా సాగుతుంటాయి. ఆయన ఆడియో ఫంక్షన్లకు యాంకర్ కూడా అవసరం ఉండదని అంటుంటారు. ఫంక్షన్లో అంతా తానై దేవిశ్రీ వ్యవహరిస్తుంటాడు. తాను హుషారుగా ఉండటమే కాక తన పక్కన ఉన్న వారిలో కూడా హుషారు నింపుతుంటాడు. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది అగ్ర దర్శకులతో దేవిశ్రీప్రసాద్ ఎంతో సన్నిహితంగా మెలుగుతూ ఉంటాడు. అందువల్లే అతడు హీరో కావడం ఖాయమని అప్పట్లో వార్తలు వచ్చేవి.

100% లవ్ సినిమాను మొదట దేవిశ్రీప్రసాద్ హీరోగా నిర్మించాలని సుకుమార్ ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు. మళ్లీ ఇన్నేళ్ళ తర్వాత దేవిశ్రీప్రసాద్ హీరోగా మారుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. నటి చార్మి ఇటీవల పూరి జగన్నాథ్ తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ను హీరోగా పరిచయం చేస్తూ చార్మి సినిమా నిర్మిస్తుందని అంటున్నారు. అయితే ఇందుకు సంబంధించిన అఫిషియల్ న్యూస్ రాలేదు.

పవన్ ఫ్యాన్స్ ని ఊరిస్తున్న హరీష్ శంకర్..!

ఒక్క సినిమా హిట్ కొట్టు.. నాని సినిమా పట్టు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -