Sunday, May 19, 2024
- Advertisement -

చరణ్ నెక్స్ట్ సినిమా గురించి అప్పుడే చెప్తాడట…!!

- Advertisement -

ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలతో పోలిస్తే రామ్ చరణ్ వెనుక పడ్డాడని చెప్పొచ్చు. ఓవైపు మరో నాలుగు సినిమాల దాక హీరోలు డైరెక్టర్ లను ఫిక్స్ చేసుకుంటుంటే చరణ్ మాత్రం RRR తర్వాత చేయబోయే సినిమాపై ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. ఎన్టీఆర్ , ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి తన తోటి హీరోలు ఇప్పటికే టాలీవుడ్ లోని బడా దర్శకులతో సినిమాలకు కమిట్ అయ్యారు. ఒక సినిమా జరుగుతుండగానే చేయబోయే మరో రెండు మూడు సినిమాల గురించి ఆలోచించే మెగా ఫ్యామిలీ లో పుట్టిన రామ్ చరణ్ ఇలా తన నెక్స్ట్ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వకపోవడం ఆశ్చర్యం  కలిగిస్తుంది.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం  రామ్ చరణ్ – వెంకి కుడుముల ప్రాజెక్ట్ గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నా దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చే విధంగా ప్రణాళిక వేసుకుంటూన్నాడట. ఆ సస్పెన్స్ కి తెర దించేసే సమయం ఆసన్నమైందని తెలుస్తోంది. దసరాకి ఈ సినిమాని అధికారికంగా ప్రకటిస్తారట. చలో సినిమా తో దర్శకుడిగా మంచి ప్రయత్నం చేసి హిట్ కొట్టిన వెంకీ రెండు సినిమా భీష్మ తో మరో హిట్ అందుకుని ద్వితీయ విజ్ఞాన్ని కూడా దాటుకుని మూడు సినిమా ను స్టార్ హీరో తో చేయడానికి రెడీ అవుతున్నారు..

ఇక చెర్రీతో వెంకి కుడుముల అలయెన్స్ ఇప్పటిది కాదు. ఇంతకు ముందు రామ్ చరణ్ నటించిన రీమేక్ మూవీ `తుఫాన్` రచయితలలో ఒకరిగా పనిచేశారు. ఆ స్నేహంతోనే వెంకి కుడుముల కు చరణ్ ఛాన్స్ ఇచ్చారని అంటున్నారు.. ఇక రామ్ చరణ్ తేజ్ RRR  సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. కోవిడ్ వల్ల షూటింగ్ తో పాటు రిలీజ్ ఆలస్యమవుతోంది. చిత్రీకరణ ముగించినా భారీ గా గ్రాఫిక్స్ పనులు చేయాల్సి ఉంటుంది. ఇక ఈ మూవీతో పాటు ఆచార్య చిత్రీకరణ ఆలస్యమవ్వడం చరణ్ కి ఇబ్బందికరంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -