రంగస్థలం సినిమాతో తన క్రేజ్‌ను బాగా పెంచుకున్నాడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ . ఈ సినిమా తరువాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం వినయ విధేయ రామ. ఈ సినిమాకు కమర్షియల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న మొదటి సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండియాలో 2019 మొదటిగా విడుదల అవుతున్న సినిమాలలో ఏ సినిమా కోసం ఎక్కువుగా ఎదురు చూస్తున్నారని ఓ సంస్థ జరిపిన సర్వేలో, రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ మొదటి స్ధానంలో నిలిచిందట.
దేశంలో 30% ప్రేక్షకులు రామ్ చరణ్ కొత్త సినిమా కోసం వెయిట్ చేస్తున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. ఇక రెండోవ స్థానంలో బాలీవుడ్ మూవీ ది ఆక్సిడెంటల్ ప్రై మినిష్టర్ సినిమా ఉందట.తరువాత స్టానాలలో రజినీకాంత్ పేటా,అజిత్ విశ్వాసం సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ టాప్ టెన్ లేకపోవడం విశేషం. ఏది ఏమైనప్పటికి రామ్ చరణ్ సినిమా కోసం ఇండియాలోనే అత్యధిక ప్రేక్షకులు ఎదురు చూడటం అనేది గొప్పే అని చెప్పాలి. సంక్రాంతికి కానుకగా జనవరి 11న ఈ సినిమా విడుదల కానుంది. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించింది.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!