మెగాపవర్‌స్టార్ రామ్ చరణ హీరోగా నటిస్తున్న చిత్రం వినయ విధేయ రామ.కమర్షియల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు.రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది.ఇప్పటికే విడుదల చేసిన టీజర్,ట్రైలర్,సాంగ్స్‌కు మంచి స్పందన వచ్చింది.అయితే ఇప్పటి వరకు విడుదల చేసిన వాటిలో ఎక్కడ కూడా హీరోయిన్ లుక్‌ను విడుదల చేయలేదు.తాజాగా సినిమాలో కియారా అద్వానీ పోస్ఱర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్.ఆకుపచ్చ గౌన్ లో కియారా అద్వానీ హాట్ హాట్‌గా కనిపిస్తుంది.ఈ ఒక్క పోస్టర్‌తోనే సినిమాలో కియారా ఏ రేంజ్‌లో రెచ్చిపోయి ఉంటుందో అర్థం అవుతుంది.
ఈ నెల 17న మధ్యాన్నం 4 గంటలకు తస్సాదియ్య అనే మరో సింగల్ విడుదల చేయబోతున్నారు.ఈ నెల 25 లేదా 27న జరిపే ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ట్రైలర్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతి రేస్ లో ఉన్న సినిమాలు అన్నిటిలోకి అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్ టైనర్ గా బరిలో దిగుతున్న వినయ విధేయ రామకు బోయపాటి బ్రాండ్ తో మెగా పవర్ తోడవ్వడంతో బాక్స్ ఆఫీస్ మరోసారి బద్దలు కావడం ఖాయమని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.
- 2,196 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- ఆపరేషన్ సింధూర్.. దేశ పరిరక్షణకు ప్రతీక
- ఉగ్రవాది మసూద్ అజర్‌కి అదిరే దెబ్బ
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!