మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన చిత్రం వినయ విధేయ రామ. మాస్ డైరెక్టర్ బోయపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఫుల్ కమర్షియల్‌గా తెరకెక్కింది ఈ సినిమా. గురువారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్‌కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి, కేటీఆర్‌లు సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌ను ఫైట్స్‌తో నింపేశాడు బోయపాటి.
”సరైన సింహం తగలనంత వరకు ప్రతీ వేటగాడు మగాడే రా.. నాకు నీలా సైన్యం లేదు.. ఒంట్లో బెరుకు లేదు.. చావంటే అస్సలు భయం లేదు.. బై బర్తే డెత్ ని గెలిచొచ్చా..” అంటూ చరణ్ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది.ట్రైలర్‌ను చూస్తుంటే బోయపాటి గత సినిమాలను గుర్తుకు తెస్తుంది. లెజెండ్, సరైనోడు,జయ జనకి నాయక సినిమాల ఛాయలు ఈ సినిమా ట్రైలర్‌లో కనిపించాయి. కాకపోతే రామ్ చరణ్ చేయడంతో కొత్తగా ఉంది. ఏది ఏమైనప్పటికి ట్రైలర్ మెగా ఫ్యాన్స్‌కు తప్ప సగటు ప్రేక్షకుడుకి నచ్చలేదని యూట్యూబ్‌లో కామెంట్స్ ద్వారా తెలుస్తుంది.మరి సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా ఎలా ఉంటుందో అని అతృతగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు.
- 2,196 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- ఆపరేషన్ సింధూర్.. దేశ పరిరక్షణకు ప్రతీక
- ఉగ్రవాది మసూద్ అజర్‌కి అదిరే దెబ్బ
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!