Tuesday, May 14, 2024
- Advertisement -

ఆ విషయంలో రామ్ చరణ్ బ్యాచ్ కు ఇంకా క్లారిటీ రాలేదు!

- Advertisement -

సాధారణంగా ఒక సినిమా కథను తయారు చేసుకొన్నప్పుడు దానికి ఒక టైటిల్ పెట్టుకోవచ్చు. కథను తయారు చేసిన వారికి ఆ మాత్రం క్లారిటీ ఉంటుంది.

కదా.. తాము రూపొందించిన కథకు ఎలాంటి టైటిల్ యాప్ట్ అవుతుందో వారికి అవగాహన ఉండాలి కూడా. అయితే రామ్ చరణ్ తేజ సినిమా రూపకర్తలకు మాత్రం ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. పెద్ద పెద్ద వాళ్లు ఈ సినిమాకు పనిచేస్తున్నా టైటిల్ మాత్రం రెడీ కాలేదు.

ఇప్పటికే ఈ సినిమా టీజర్ వరకూ వచ్చేసింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో చరణ్ హీరోగా రూపొందుతున్న సినిమాకు సంబంధించిన టీజర్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. అయితే ఇప్పటికీ దానికి టైటిల్ ను ప్రకటించలేదు. ఆర్ సీ9 గానే టీజర్ ను విడుదల చేశారు. చరణ్ నటిస్తున్న తొమ్మిదో సినిమా కాబట్టి దీనికి ఆర్ సీ9 అనే వ్యవహరిస్తున్నారు. 

ఈ సినిమా కు సంబంధించి రకరకాల టైటిళ్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే వీటిలో ఏది ఫైనల్ అవుతుందో మాత్రం క్లారిటీ లేదు. మరి ఎప్పటికి క్లారిటీ వస్తుందో కూడా ప్రస్తుతానికి తెలీదు. సినిమా దసరాకు విడుదల అవుతుంది కదా.. అప్పటికి అయితే కచ్చితంగా ఏదో ఒక టైటిల్ పెడతారులే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -