వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక వివాదాలలో లేకపోతే నిద్ర పట్టదనుకుంటా. ఆయన దర్శకత్వం వహిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్‌తో ఎన్నో వివాదాలను కొని తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. . తాజాగా మరో వివాదాన్ని కొన్ని తెచ్చుకోవాడినికి రెడీ అయ్యాడు. గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై చాలానే కామెంట్స్ చేసిన వర్మ,మరోసారి పవన్‌ను టార్గెట్ చేశాడు. వచ్చే ఎన్నికలలో ఏపీకి పవన్ ముఖ్య మంత్రి అవుతారని, ఒకవేళ ముఖ్యమంత్రి కాకపోతే, ముఖ్యమంత్రి అయిన వారికి మొగుడు అవుతాడని చెప్పుకొచ్చాడు వర్మ.
గత ఎన్నికలలో చంద్రబాబు తన అలవాటు ప్రకారం పవన్‌ను వెన్నుపోటు పోడిచినందుకుగాను ,ఈ ఎన్నికల్లో పవన్ తన స్టైల్లో నిజాయితీతో నారా చంద్రబాబుని ముందుపోటు పొడుస్తాడని తన ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు వర్మ. గతకొంత కాలంగా పవన్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వర్మ, ఇప్పుడు పవన్‌కు పాజిటివ్‌గా తన ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టడం చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
- Advertisement -
పవన్ సీఎం అవుతారు.. లేకపోతే సీఎంకు మొగుడు అవుతాడట..!
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -