వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ తరుచు తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటాడు.తాజాగా మరోసారి తన కామెంట్స్‌తో వార్తల్లో నిలిచాడు.తన శిష్యుడు సిద్ధార్థ్ దర్శకత్వం వహించిన భైరవగీత సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా రామ్ గోపాల్ వర్మ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.మొదటి ఎలక్షన్స్ కంటే రెండవసారి ఎక్కువ స్థాయిలో గెలవడం ఎవరికీ సాధ్యం కానిది. కేసీఆర్ ఆ స్థాయిలో గెలుస్తారని నేను అసలు ఉహించనే లేదు.
కేసీఆర్ ఇలియాన కంటే కేసీఆరే అందంగా ఉంటారని కామెంట్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ.ఇలియాన అందం,డ్యాన్స్ మూడు,నాలుగు నిమిషాల కన్నా ఎక్కువ సేపు చూడలేమని,అదే కేసీఆర్ మాట్లాడుతుంటే ఎంతసేపు అయిన చూడవచ్చని చెప్పుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ.తను నిర్మాతగా వ్యవహరిస్తున్న భైరవగీత సినిమా ప్రమోషన్స్ కోసమే వర్మ ఇలా మాట్లాడుతున్నారని అంటున్నారు నెటిజన్లు.
- ఆపరేషన్ సింధూర్.. దేశ పరిరక్షణకు ప్రతీక
- ఉగ్రవాది మసూద్ అజర్‌కి అదిరే దెబ్బ
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు