టాలీవుడ్ వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో క్రేజీ బయోపిక్‌కి తెరలేపాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్‌ను వెండితెర మీద చూపించబోతున్నాడు రామ్ గోపాల్ వర్మ. రెండు రోజులు క్రితమే ఈ బయోపిక్‌కి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. సినిమా టైటిల్‌ను ‘టైగర్ కేసీఆర్’గా కూడా అనౌన్స్ చేశాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటను కూడా రెడీ చేశాడు. “మా భాష మీద నవ్వినవ్… మా ముఖాల మీద ఊసినవ్… మా బాడీల మీద నడిసినవ్ ఆంధ్రోడా… వస్తున్నా… వస్తున్నా… మీ తాటతీయనీకి వస్తున్నా…” అంటూ తాను ప్రకటించిన ‘టైగర్ కేసీఆర్’ లోని ఓ సాంగ్ లిరిక్స్ పడి వినిపించాడు రామ్ గోపాల్ వర్మ.
ఈ పాట లిరిక్స్ ఇప్పుడు తీవ్ర వివాదం రేపేలా ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ స్వయంగా పాడుతూ వీడియో తీసి యూ ట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ వీడియో చూసిన వారంతా ఇది ఆంధ్రులనందరినీ అవమానించేలా ఉందని, ఈ పాటను అంగీకరించేది లేదని కామెంట్లు పెడుతున్నారు. మరి దీనిపై రామ్ గోపాల్ వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి. విడుదలకు ముందే ఇన్ని సంచనాలు సృష్టిస్తున్న కేసీఆర్ బయోపిక్ విడుదల తరువాత ఇంకెన్ని వివాదాలు సృష్టిస్తుందో చూడాలి.
- Advertisement -
ఆంధ్రులను రెచ్చగొడుతున్న రామ్ గోపాల్ వర్మ ‘కేసీఆర్ బయోపిక్’ పాట
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -