Tuesday, May 6, 2025
- Advertisement -

ఎన్టీఆర్‌ను క‌నిపెట్టండి….రూ 10 ల‌క్ష‌లు ప‌ట్టుకెల్లండి..వ‌ర్మ సూప‌ర్ ఆఫ‌ర్

- Advertisement -

లక్ష్మీపార్వతి జీవితచరిత్ర ఆధారంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే బయోపిక్ చేయడానికి రామ్ గోపాల్ వర్మ రెడీ అవుతున్నాడు. రాకేశ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాను, ఈ నెల 19వ తేదీన తిరుపతిలో ఆరంభించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.ఈ సినిమాలో ముఖ్య పాత్రల కోసం వర్మ వెతుకులాట
మొదలుపెట్టారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ అల్లుడి పాత్ర చంద్రబాబు నాయుడు కోసం ఆయనలా కనిపించే ఓ వ్యక్తి వీడియోని షేర్ చేసిన వర్మ అతడి వివరాలు పంపితే రూ.లక్ష కానుకగా ఇస్తానని ప్రకటించారు. అన్నట్లుగా రోహిత్ అనే వ్యక్తి వివరాలు తెలపగా.. అతడికి లక్ష నగదు బదిలీ చేశారు. తాజాగా వర్మ సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టారు.

ఎన్టీఆర్ పాత్ర కోసం ముగ్గురిని షార్ట్ లిస్ట్ చేశానని, కానీ తనకి ఇంకా ఉత్తమమైన నటుడు కావాలని వర్మ అన్నారు. ఈ మేరకు ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఎన్టీ రామారావు పోలికలతో ఎవరైనా కనిపిస్తే చెప్పండి .. 10 లక్షలు బహుమతిగా ఇస్తానని తాజాగా వర్మ ప్రకటించాడు.

లక్ష్మీపార్వతిని కలిసినప్పుడు ఎన్టీఆర్ ఏ వయసులో ఉన్నారో, అప్పుడు ఎలా కనిపించేవారో.. అలా ఉండే నటుడు కావాలి. ఆయనలా ఉండే, మాట్లాడే వ్యక్తి కనబడితే వీడియోని [email protected]కు పంపండి. వారికి రూ.10లక్షలు బహుమతిగా ఇస్తానని ఓపెన్ ఆఫర్ చేస్తున్నా” అంటూ వెల్లడించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -