శ్రీరెడ్డి బయెపిక్‌కు రెడీ అవుతున్న సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనంగా మారిన కాస్టింగ్ కౌచ్ వివాదానికి ఆధ్యురాలు శ్రీరెడ్డిపై బయోపిక్ రెడీ అవుతున్నాడని సమాచారం.తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనను వాడుకొని వదిలేశారని శ్రీరెడ్డి ప్రధాన ఆరోపణ.తెలుగు ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు చాలా ఎక్కువ అని కొన్ని టీవి షోల ముందు తనకు జరిగిన అన్యాయన్ని గురించి చెప్పుకొచ్చింది. దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు అభిరాం తనకు అవకాశాలు ఇప్పిస్తాని చెప్పి తనను లైంగికంగా వాడుకొని వదిలేశాడని ..దానికి సాక్ష్యంగా అభిరాంతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను విడుదల చేసి సంచలనానికి తెర లేపింది.మా అసోసియేషన్ ఈమెను బ్యాన్ చేయడం.. మళ్లీ వెంటనే ఈమెపై ఉన్న బ్యాన్ తీసేయడం చకచక జరిగిపోయ్యాయి. శ్రీరెడ్డి పవన్ని ఉద్దేశించి చేసిన అనుచిత వాఖ్యలకు అన్నివైపుల నుండి విమర్శలు రావడంతో శ్రీరెడ్డి పవన్‌పై చేసిన మాటలకు క్షమాపణలు చెప్పింది
ఇప్పుడు శ్రీరెడ్డి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. టాలీవుడ్ వివాదల దర్శకుడు రాంగోపాల్ వర్మ శ్రీరెడ్డి జీవితాన్ని సినిమాగా తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. శ్రీరెడ్డి ఇండస్ట్రీకి ముందు , ఇండస్ట్రీ తర్వాత ఎలా ఉందనే దాని మీద సినిమా ఉండేలా వర్మ ప్లాన్ చేస్తున్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సంచలన విషయాలను సినిమాగా తీయడానికి వర్మ ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. రక్త చరిత్ర ,వంగవీటి,ఎన్టీఆర్ బయోపిక్ ఈ వరుసలోకే వస్తాయి. వర్మ ఇప్పడు తాజాగా జీవితాన్ని సినిమాగా తీయడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అసలు పవన్ కల్యాణ్‌పై చేసిన వాఖ్యల వెనుక నేనె ఉన్నానని వర్మ క్లారిటీ ఇచ్చారు. మరి శ్రీరెడ్డి బయోపిక్‌లోఎన్ని విషయాలను బయటపెడతాడో చూద్దాం!