Friday, May 9, 2025
- Advertisement -

నంది అవార్డుల‌పై దుమ్మురేపుతున్న వ‌ర్మ సెటైరిక్ పాట‌..

- Advertisement -

నంది అవార్డుల‌పై దుమారం కొన‌సాగుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నంది అవార్డుల‌పై ఎన్న‌డూ లేనంత‌గా విమ‌ర్శ‌లు వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. పూర్తి వివ‌క్షాపూరితంగా నంది అవార్డుల‌ను ప్ర‌క‌టించార‌ని సినీ ప్ర‌ముఖులు గ‌గ్గోలు పెడుతున్నారు. ఇప్ప‌ట్లో స‌ద్దుమ‌నిగేలా లేదు. తాజాగా వ‌ర్మ చేసిన కామెంట్స్ మ‌రింత దుమారం రేపుతున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా వ‌ర్మ‌ నంది అవార్డుల‌పై ఒక పాట‌నే విడుద‌ల చేశారు. ‘ఒక‌టా.. రెండా.. తొమ్మిదీ.. మ‌రి ఒక‌టే నేను నంది’ని అంటూ పాత సినిమాలోని నృత్యాన్ని తాజాగా ప్ర‌క‌టించిన నంది అవార్డుల‌ను ఉద్దేశిస్తూ పోస్ట్ చేశారు. ‘ఇష్ట‌మొచ్చిన‌ట్లు పంచుకోవ‌డం మాకు ఇష్టం… మేము చెప్పిన‌ట్లు త‌ల ఊపూ నందీ.. అనే సెటైరిక్ పాటు ఇప్పుడ వైర‌ల్‌గా మారింది. ఇంకెందుకు నందులు.. ఎందుకో?.. అంకెలు చూస్తే తొమ్మిది మా కోరిక మాత్రం క‌మ్మ‌ది’ అంటూ నంది అవార్డుల‌పై భారీ సెటైర్లు వేశారు వ‌ర్మ‌.

గంగిరెద్దులాగ న‌న్ను చూడకండి.. అక్క‌డ‌క్క‌డే తిప్ప‌కండి’ అంటూ ‘నంది’ పాట పాడుతుంద‌ని ఆయ‌న వివ‌రించారు. ‘అడ్డు వ‌చ్చేవారు లేరు మాకు ప‌చ్చ జెండా ఊపుతాము మేమూ’ అంటూ విప‌రీత‌మైన కామెడీని ఈ పాట‌లో వినిపించారు. అదేదో మీరు చూడండి…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -