టాలీవుడ్ వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరుచు వివాదలతో వార్తల్లో నిలుస్తుంటాడు. సీనియర్ హీరో బాలకృష్ణ తన తండ్రి తారక రామారావు జీవిత కథను బయోపిక్‌గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అతనికి పోటీకి రామ్ గోపాల్ వర్ కూడా ఎన్టీఆర్ బయోపిక్‌ను లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఓ సినిమాను తీస్తున్నాడు. నేను తీసేదే అసలైన సినిమా ,బాలయ్య తీసే బయోపిక్ వాస్తవాలను చూపించరని చెప్పి పెద్ద సంచలనానికే తెరలేపాడు. ఇక ఎన్టీఆర్ బయోపిక్‌ల విషయంలో ప్రముఖ ఆద్యా మీడియా ప్రజల ఓపినియన్‌ను అడగడం జరిగింది. ఏది అసలైన ఎన్టీఆర్ బయోపిక్ మూవీగా మీరు భావిస్తున్నారని ఆద్యా మీడియా సోషల్ మీడియాలో ఓ పోల్ పెట్టింది. క్రిష్ దర్శకత్వం మహానాయకుడు,కథనాయకుడు, వర్మ దర్శకత్వం వహిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇవేమి కావు అని ఓ పోలింగ్ పెట్టడం జరిగింది. దీనికి ప్రజల నుంచి అనుహ్య స్పందన రావడం జరిగింది.
ఎక్కవ శాతం ప్రజలు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న లక్ష్మీస్‌కే ఓటు వేయడం గమనర్హం. చాలా మంది వర్మ ఎన్టీఆర్‌కే మద్దతు తెలిపారు. తాజాగా ఆద్యా మీడియా పెట్టిన ఓపినియన్ పోల్‌పై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తు ఓ ట్విట్ చేశారు. నేను తీసేదే అసలైన ఎన్టీఆర్ బయోపిక్ మూవీ అని, ఈ పోల్ స్పష్టం చేసిందని ఆద్యా మీడియా పెట్టిన పోల్‌ను తన ట్విట్‌లో షేర్ చేశారు.దాదాపు 75 శాతం మంది వర్మకే ఓటు వేశారు. గత కొద్ది కాలంగా ఆద్యా మీడియా ఇలా సీని,రాజకీయ అంశాలపై సోషల్ మీడియాలో ప్రజలన స్పందన కోరుతు పోల్ నిర్వహించడం జరుగుతుంది. ఈ పోల్‌పై ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది.ఇక భవిష్యత్తులో కూడా ఇటువంటి పోల్స్ నిర్వహించి ప్రజల అభిమానాన్ని గెలుచుకుంటామని ఆద్యా మీడియా స్పష్టం చేసింది.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!