హీరో రామ్ ఇటీవల సోషల్ మీడియాలో కాస్తా యాక్టివ్‌గానే ఉంటున్నాడు. రామ్ తన సినిమా గురించి తప్ప మరే మిగత విషయాల గురించి పెద్దగా పట్టించుకోడు. అలాంటి రామ్ తెలంగాణ ఎన్నికలపై మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచాడు. తెలంగాణ ఎన్నికలలో అందరు ఓటు వేయలని ,మంచి నాయకుడిని ఎన్నుకోవాలి అని రామ్ ఓ వీడియో ద్వారా అభిమానులను కోరారు.
తాజాగా మరోసారి రామ్ ఓటు హక్కు గురించి మాట్లాడారు. రామ్ వేటువేశాక చేతి వేలికున్న సిరా గుర్తును చూపుతూ ఓ ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసుకున్నాడు. దానికి ‘నాది నాదే.. మరి మీది?’ అన్న క్యాప్షన్ ను జత చేశాడు. రామ్ పిలుపు మేరకు పలువురు తాము ఓటు వేశాక దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే ఓ యువకుడు మాత్రం రామ్ ఛాలెంజ్ కు స్పందిస్తూ ‘మాది ఆంధ్రాలే’ అని కామెంట్ పెట్టాడు. దీనికి రామ్ అంతే ఫన్నీగా స్పందించాడు. ‘అది కూడా మనదే తమ్ముడూ.. మనకు ఒక్క ముఖ్యమంత్రి సరిపోలేదనే ఇద్దరికి ఇచ్చాం. విడదీసి ఇచ్చాం తప్ప విడిపోలేదు. ఏపీ, తెలంగాణ రెండూ మనవే’ అని కౌంటర్ వేశారు. కాగా, రామ్ జవాబు ఇచ్చిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక రామ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.
- క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతో నవాజుద్దీన్!
- 60 ఏళ్ల తర్వాతే ఆ సినిమా చేస్తా!
- మహేశ్ బాబుకు షాకిచ్చిన ఈడీ..
- పుష్ప 2..వీఎఫ్ఎక్స్ బ్రేక్‌డౌన్ వీడియో!
- డ్రగ్స్ రైడ్… మలయాళ నటుడు?