Tuesday, May 7, 2024
- Advertisement -

పబ్ లో పెద్ద పార్టీ ఇవ్వబోతున్న ‘ఇస్మార్ట్ శంకర్’

- Advertisement -

‘హలో గురు ప్రేమకోసమే’ సినిమా తరువాత ఎనర్జిటిక్ హీరో రామ్ ఎట్టకేలకు ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నిధి అగర్వాల్ మరియు నభా నటేశ్ లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఈ మధ్యన విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 23.6 కోట్లను నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న హీరో రామ్ పెద్ద పార్టీ ఇవ్వబోతున్నారు. తన మీడియా మిత్రులు అందరికీ తన చిత్ర బృందంతో జూబ్లీహిల్స్ లోని ఒక పబ్ లో పెద్ద పార్టీ ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

నిజానికి రామ్ మంచి హిట్ అందుకొని చాలా కాలం అయింది. ఆఖరిగా 2016 లో విడుదలైన ‘నేను శైలజ’ సినిమా హిట్ అయిన తర్వాత రామ్ ఖాతాలో పెద్దగా మంచి హిట్లు ఏమీ లేవు. ఈ మధ్యనే విడుదలైన ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమా కూడా అంతంతమాత్రంగానే వసూలు చేసింది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా పై భారీ అంచనాలు లేకపోయినప్పటికీ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూ రామ్ రికార్డులన్నిటినీ బ్రేక్ చేస్తుంది. ఈ విజయానందం తోనే రామ్ పార్టీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -