Sunday, May 4, 2025
- Advertisement -

బాలీవుడ్‌లో ఫిక్స‌యిన రానా

- Advertisement -

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌తో పాటు టాలీవుడ్ త‌న సొంత ప‌రిశ్ర‌మ‌గా ద‌గ్గుబాటి రానా పాతుకుపోయాడు. ఆ సినీ ప‌రిశ్ర‌మ‌లో ఫిక్స‌యి కూర్చున్నాడు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారంతా బాలీవుడ్‌లో ఎవ‌రూ రాణించ‌లేదు. ఒక‌టి రెండు సినిమాలు చేసి మ‌ళ్లీ తిరిగి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చిన వారు చాలామంది ఉన్నారు. బాలీవుడ్‌లో నిల‌దొక్కుకునేలా ఎవ‌రూ లేరు. కానీ ద‌గ్గుబాటి రానా మాత్రం బాలీవుడ్‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరుగా మారింది.

రానా మాత్రం మంచి అవకాశాలను అందుకొని బాలీవుడ్‌లో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. సినిమాల్లో ప్ర‌త్యేక పాత్ర‌ల్లో మెరుస్తూ బాలీవుడ్‌లో రాణిస్తున్నాడు. బాహుబలి సినిమాతో బాలీవుడ్‌లో సుస్థిర స్థానం ఏర్పాటుచేసుకున్నాడు. అస‌లు బాహుబ‌లి సినిమా హిందీలో బాగా ఆడ‌డానికి కార‌ణంగా రానా అని చెప్పుకోవ‌చ్చు. ఏ జవాని హై దివాని సినిమాతో రానాకు, కరణ్ జోహార్‌కి మంచి స్నేహం ఏర్పడింది. కరణ్ జోహార్ ద్వారా బాహుబలిని భారీగా విడుద‌ల చేయించారు.

వీరిద్ద‌రు క‌లిసి మ‌రో సినిమాలో క‌నిపిస్తున్నారు. డిఫెరెంట్ కథతో సినిమాలో క‌న‌బ‌డుతున్నారు. చక్రి తోలేటి దర్శకత్వంలో వెల్కమ్ టూ న్యూ యార్క్ అనే త్రీడీ కామెడీ సినిమా రూపొందిస్తున్నారు. సోనాక్షి సిన్హా – దిలీజిత్ దోసఙ్హ్ ప్రధాన పాత్రల్లో వ‌స్తున్న సినిమాలో కరణ్ జోహర్, రానా, రితేశ్ దేశ్‌ముఖ్, బొమన్ ఇరానీ వంటి నటీనటులు న‌టిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ పూర్తవుతోంది. మరికొన్ని రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఫినిష్ చేయాలని దర్శకుడు అనుకుంటున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన విడుద‌ల చేయాలని భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -