టాలీవుడ్ నటుడు రానా బాహుబలి సినిమాతో నేషనల్ లేవల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహర్ నిర్వహించే కాఫీ విత్ కరణ్ ప్రొగ్రామ్‌కు రానాతో పాటు రాజమౌళి,ప్రభాస్‌లు హాజరైయ్యారు. ఈ సందర్భంగా కరణ్ జోహర్ రానా ఎఫైర్ల గురించి అడిగాడు.రానాకి ‘త్రిషతో డేటింగ్ చేసావు కదా.. పెళ్ళెందుకు చేసుకోలేదనే’ ప్రశ్న ఎదురుకాగా.. తమ మధ్య లాంగ్ ఫ్రెండ్ షిప్ ఉంది తప్ప లాంగ్ డేటింగ్ లేదని రానా చెప్పాడు.
ఎక్కువ కాలం ఫ్రెండ్లీగా ఉండడంతో చాలా మంది డేటింగ్ అని భ్రమపడ్డారని, అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు. నీ తోటి హీరోలందరు పెళ్లి చేసుకున్నారు కదా , మరి నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్ అని అడగ్గా..పెళ్లయితే భార్యతోనే సమయం గడపాలి, ఫ్రెండ్స్, సింగిల్ స్టేటస్ ఉండదని కాబట్టి అలాంటి లైఫ్ ఎందుకులే అని పెళ్లి చేసుకోలేదని వివరణ ఇచ్చాడు రానా.
- 2,196 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- ఆపరేషన్ సింధూర్.. దేశ పరిరక్షణకు ప్రతీక
- ఉగ్రవాది మసూద్ అజర్‌కి అదిరే దెబ్బ
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!