Monday, April 29, 2024
- Advertisement -

అపంటిసైటిస్ తో బాధ పడుతున్న రణదీప్

- Advertisement -

ప్రముఖ బాలీవుడ్ హీరో రణదీప్ హుడా సుల్తాన్ సినిమా సెట్ లో కుప్పకూలారు. గత కొంతకాలంగా అపంటిసైటిస్ తో బాధపడుతున్న రణదీప్ సుల్తాన్ షూటింగ్ లో పాల్గొన్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం రెజ్లింగ్ ఆటపై తీస్తున్నారు.

ఇందులో రణదీప్ హుడా కూడా ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. సెట్ లో పడిపోయిన రణదీప్ ఢిల్లీలోని ఫోర్టిస్ ఆసుప్రతిలో చేర్చారు. ఈ రోజు ఆయనకు ఆపరేషన్ చేశారు. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న రణదీప్ అంకితభావంతో పనిచేస్తారని, అందుకే నొప్పి భరిస్తూనే షూటింగ్ లో పాల్గొన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రణదీప్ ప్రస్తుతం సరబ్ జిత్, లాల్ రంగ్ చిత్రాల్లో నటిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -