- తరి తరిరరా అంటూ మెలోడీ సాంగ్
- బాలకృష్ణుడు సినిమాలో పాట
సినీతారలు పాటలు పాడడంలో కొత్తేం కాదు. పవన్ కల్యాణ్ మొదలుకొని చిన్న చిన్న తారలు కూడా పాటలు పాడేస్తున్నారు. మైక్ పట్టుకొని తమ గొంతు వినిపిస్తున్నారు. తమ గానామృతాన్ని పంచుకున్నారు. మొన్న తన సినిమాలో నందమూరి బాలకృష్ణ పైసా వసూల్ అనే పాట పాడి అభిమానులు, ప్రేక్షకులను జోష్‌లో నింపారు. దీనికి ఆద్యం పోసిన వ్యక్తి దేవీశ్రీప్రసాద్. తాను చేస్తున్న సినిమాల్లో తారల చేత పాటలు పాటించే సంస్కృతిని ప్రారంభించాడు.
ఆ పరంపర ఇక కొనసాగుతూ వస్తోంది. హీరోలు, హీరోయిన్లు పాటలు పాడేస్తున్నారు. ఆ క్రమంలో హీరోయిన్ రాశీఖన్నా కూడా పాటలు పాడేస్తోంది. సందీప్ కిషన్ నటించిన జోష్ సినిమా టైటిల్ పాట పాడిన ఆమె మళ్లీ మైక్ పట్టారు. నారా రోహిత్, రెజీనా నటించిన బాలకృష్ణుడు సినిమాలో ఓ పాట పాడారు. తరి తరిరరా అనే మెలోడీ సాంగ్‌ను ఆమె పాడారు. ఈ పాట బాగా ఆకట్టుకుంటోంది. ఆమె పాడిన అందరికీ నచ్చడంతో అందరూ మెచ్చుకుంటున్నారు.