Friday, April 26, 2024
- Advertisement -

శ్రీవిష్ణు, నారా రోహిత్ బెస్ట్ ఫ్రెండ్స్ అని మీకు తెలుసా ?

- Advertisement -

హీరో శ్రీవిష్ణు.. మొదట్లో చిన్న చిన్న వేశాలు వేస్తూ నెమ్మదిగా హీరో అయ్యాడు. అయితే శ్రీవిష్ణు హీరోగా చిన్న సినిమాలు చేస్తూనే.. స్టార్ హీరోల సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నాడు. శ్రీ విష్ణు నటించిన “ఉన్నది ఒకటే జిందగీ, మెంటల్ మదిలో, అప్పట్లో ఒకడుండేవాడు, బ్రోచేవారెవరురా, నీది నాది ఒకే కథ, వీర భోగ వసంత రాయలు, తిప్పరా మీసం” తదితర చిత్రాలతో ప్రేక్షకులను బానే ఆకట్టుకున్నాడు.

ఇక ఇటీవలే శ్రీవిష్ణు ఓ ఇంటర్వూలో పలు విషయాలు చెప్పాడు. తెలుగు సినీ పరిశ్రమలోని తన స్నేహితుల గురించి చెబుతూ సినిమా ఇండస్ట్రీలో తనకు అత్యంత సన్నిహితుడు మరియు ప్రాణస్నేహితుడు నారా రోహిత్ అని చెప్పుకొచ్చాడు. అంతేగాక వీరిద్దరు కలిసి నటించిన సినిమాలు కూడా ప్రేక్షకులను అకట్టుకున్నాయి. నారా రోహిత్ ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా తన కోసం షాపింగ్ చేస్తుంటాడని తాను కూడా అదే విధంగా ఏదైనా నారా రోహిత్ కోసం ఏదైనా తీసుకోవాలనిపిస్తే వెంటనే తీసుకుంటానని కూడా తెలిపాడు.

ఇప్పటి వరకు తమ వద్ద మధ్య విభేదాలు గాని మనస్పర్థలు గాని రాలేదని నారా రోహిత్ కూడా ఎప్పుడు తన మనసుకి కష్టం కలిగించే విధంగా ప్రవర్తించలేదని, నారా రోహిత్ చాలా సున్నిత మనస్తత్వం కలవాడని కూడా తెలిపాడు. అంత మంచి ఫ్రెండ్ తనకు దొరకడం నిజంగా అదృష్టం అని శ్రీవిష్ణు చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -