Saturday, May 4, 2024
- Advertisement -

కరెక్ట్ టైం లో సిసలైన విజయం సాధించిన రష్మిక..

- Advertisement -

కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమా తో ఒక్కసారిగా దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమ చూపు మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న నటి రష్మిక. ఆ సినిమా అందించిన విజయం రష్మిక కి వేరే పరిశ్రమల్లో అడుగు పెట్టడానికి బాగా తోడ్పడింది. ముఖ్యం గా ఆ సినిమా ఇచ్చిన విజయం తో రష్మిక తెలుగు లో మొదటగా చలో అనే సినిమా తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ సినిమా తర్వాత వెంటనే గీత గోవిందం లో నటించి ఒక్కసారిగా స్టార్డం అందుకుంది. ఆ తర్వాత చేసిన దేవదాస్ సినిమా లో కూడా రష్మిక అందరి ప్రశంసలు అందుకుంది.

కానీ రష్మిక తన పర్ఫార్మెన్స్ ని పూర్తి గా చూపించే అవకాశం మాత్రం డియర్ కామ్రేడ్ తో నే అందుకుంది. గత శుక్రవారం విడుదల అయిన ఈ సినిమా లో లిల్లీ అనే పాత్ర ని రష్మిక పోషించి విమర్శకుల ప్రశంసల తో పాటి ప్రేక్షకుల మన్ననలు కూడా పొందింది. ఒక వైపు మహేష్ బాబు తో సరిలేరు నీకెవరు అనే సినిమా, అల్లు అర్జున్ సరసన సుకుమార్ దర్శకత్వం లో ఒక సినిమా సైన్ చేసిన రష్మిక కి కరెక్ట్ టైం లో డియర్ కామ్రేడ్ విజయం వరించింది అని చెప్పుకోవచ్చు.

ఈ సినిమా అందించిన విజయం తో, రెట్టింపు ఆనందం తో, రష్మిక ఈ భారీ చిత్రాల్లో నటించనుంది. సూటిగా చెప్పాలంటే, డియర్ కామ్రేడ్ విజయం రష్మిక ని వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -