Friday, May 17, 2024
- Advertisement -

రౌడీ వేర్ ని విస్తరించనున్న రష్మిక

- Advertisement -

విజయ్ దేవరకొండ చేసింది తక్కువ సినిమాలే కానీ ఈ హీరో సంపాదించుకున్న క్రేజ్ మరియు స్టార్డం అంతా ఇంతా కాదు. తన మొదటి సినిమా పెళ్లి చూపుల తో పెద్ద విజయం సాధించి, ఆ పై అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాల తో ఒక స్టార్ గా ఎదిగాడు విజయ్. ఇటు సినిమాలు చేస్తూ నే, సొంతంగా రౌడీ వేర్ ని స్థాపించి తన బట్టల బిజినెస్ ని కూడా ఆరంభించాడు. రౌడీ వేర్ కి సేల్స్ మంచిగా సాగడమే కాక డబ్బు కూడా బాగానే వస్తుందని తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు రౌడీ వేర్ లో కేవలం పురుషులకి మాత్రమే బట్టలు దొరుకుతున్నాయి.

ఎప్పుడెప్పుడు మహిళలకి కూడా రౌడీ వేర్ లో బట్టలు దొరుకుతాయా అని చాలా మంది విజయ్ అభిమానులు ఎదురు చూస్తూ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ తరుణం రానే వచ్చింది. డియర్ కామ్రేడ్ విడుదల టైం కల్లా రౌడీ వేర్ ని విస్తరించనున్నారట. మహిళల కి సంబందించిన దుస్తులు కూడా అందుబాటులోకి తేనున్నారట. మరీ ముఖ్యం గా ఈ మహిళల వేర్ కి సంబందించిన సేల్స్ ని రష్మిక లాంచ్ చేయనున్నట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -