- Advertisement -
సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిన అంకిత గుర్తుంది కదూ. ఈమె ఎవరో కాదు.. చిన్నప్పుడు ఐ లవ్ యు రస్నా అంటూ యాడ్ లో పలకరించిన చిన్న పిల్లే. లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో కూడా నటించిన ఆమె నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు రాకపోవడంతో ముంబైకి చెందిన ఓ బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. కాగా ఈ బొద్దుగుమ్మ తాజాగా సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తోందని టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ నటిస్తున్న జైలవకుశలో ఓ చిన్న పాత్రలో మెరవనుందట ఈ అమ్మడు. మరి సెకండ్ ఇన్నింగ్సైనా ఈ అమ్మడికి కలిసివస్తాయేమో చూడాలి.