Saturday, April 20, 2024
- Advertisement -

అస‌క్తి రేపుతున్న ఆవిరి టీజ‌ర్

- Advertisement -

హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఎ ఫ్ల‌యింగ్ ఫ్రాగ్స్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ర‌విబాబు దర్శ‌క నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం ఆవిరి. ర‌విబాబు, నేహా చౌహాన్‌, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్‌, ముక్తార్ ఖాన్ ప్ర‌ధాన తారాగ‌ణంగా నటిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. శ‌నివారం ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

ఓ ఫ్యామిలీ ఉండే ఇంట్లో ఆత్మ ఉంటే ఎలాంటి ప‌రిస్థితులు చోటు చేసుకుంటాయ‌నే కాన్సెప్ట్ మీద ద‌ర్శ‌క నిర్మాత ర‌విబాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. ట్రైల‌ర్‌లో స‌న్నివేశాలు, విజువ‌ల్స్‌, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచుతున్నాయి. హార‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో ర‌విబాబు త‌న‌దైన మార్కును క్రియేట్ చేశారు. ఇప్పుడు మ‌రోసారి హార‌ర్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్ date అనౌన్స్ చేయ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -