హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం మిస్టర్ బచ్చన్. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా తాజాగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది.
ట్రైలర్ ఆధ్యంతం రవితేజ ఎనర్జీకి ఏమాత్ర తీసిపోకుండా కట్ చేశారు. సరిహద్దు కాపాడేవాడే సైనికుడు కాదు… సంపద కాపాడేవాడు కూడా సైనికుడే అని చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. ముఖ్యంగా రవితేజ హై-ఎనర్జీ అదుర్స్ అనిపించేలా ఉంది. ట్రైలర్‌లో యాక్షన్‌తో పాటు రొమాన్స్, డ్రామా కలగలిపి కట్ చేశారు.
మిస్టర్ బచ్చన్‌లో జగపతి బాబు పవర్ ఫుల్ రోల్‌ని పోషించారు. ఇక ట్రైలర్‌లో మరింత ఆకర్షణగా నిలిచింది భాగ్యశ్రీ బోర్స్. అద్భుతమైన గ్లామర్, పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా తెరపై రవితేజ – భాగ్యశ్రీ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా ప్రతి ఫ్రేమ్‌లో గ్రాండియర్ స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా మిస్టర్ బచ్చన్‌తో రవితేజ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
