‘టచ్ చేసి చూడు’ సినిమా ఫ్లాపయినా మాస్ మహారాజ రవితేజ మాత్రం మాంచి ఊపు మీద ఉన్నాడు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ ప్రస్తుతం ‘నేల టికెట్’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం భారీ సెట్‌ను హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేశారు. భారీ బడ్జెట్‌తో తీర్చిదిద్దిన ఈ సెట్‌లోనే ఎక్కువ శాతం సినిమా షూటింగ్ జరగనుందని సమాచారం.
సెట్ సిద్ధమవడంతో ఇక సినిమా షూటింగ్‌లో వేగం పెంచి మే వరకు షూటింగ్ మొత్తం పూర్తి చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. అన్నీ పనులు పూర్తి చేసుకొని మే నెలాఖరుకు సినిమా విడుదల చేయాలని చూస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసారు. మాళవిక శర్మ హీరోయిన్‌గా చేస్తుండగా రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. శక్తికాంత్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత రవితేజ శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోని’ అనే సినిమాను చేస్తున్నారు.
