ఒకప్పుడు సెలబ్రిటీలు తమ భార్యలను గోప్యంగా ఉంచేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. భర్తలతో పాటు గా వారు కూడా వారికి నచ్చిన రంగాల్లో దూసుకెళ్తున్నారు. వారి తమ భర్తల సంపాదన మీద ఆధార పడకుండా స్వతహాగా తమ ఆదాయ మార్గాలను వారు అన్వేషించుకుంటున్నారు.
హీరో నాని భార్య అంజనా బెంగళూరు నిఫ్ట్ లో ఫ్యాషన్ డిజైనర్ గా శిక్షణ తీసుకుంది. పెళ్లి తర్వాత వారికోక బాబు కూడా పుట్టాడు. ఈమె ఇప్పుడు ఆర్కామీడియాలో.. క్రియేటివ్ డిపార్ట్ మెంట్ హెడ్ గా పని చేస్తుంది. యాంకర్ సుమ సంపాదన గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. యాంకరింగ్ తో పాటు నిర్మాణరంగంలో అడుగుపెట్టింది సుమ. సుమ సంపాదన రాజీవ్ సంపాదన కంటే చాలా ఎక్కువ. ఉపసన గురించి తెలియని వారు లేరు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఉపాసన ఎప్పటికప్పడు వార్తల్లో ఉంటుంది. అపోలోలో చురుకైన పాత్రతో పాటు..సోషల్ యాక్టివిటీస్ లో కూడా పాల్గొంటుంది. అల్లరి నరేశ్ భార్య విరూప ఈవెంట్ మానేజర్ గా చేస్తుంది. ఒక్క ఈవెంట్ కే లక్షలు ,కోట్లల్లో టారిఫ్ ఉండే వాటిల్లో విరూప సంపాదన అల్లరి నరేశ్ సంపాదన కంటే రెట్టింపు.
స్నేహారెడ్డి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్పెక్ట్రం అనే మ్యాగజీన్ కి ఛీఫ్ ఎడిటర్ గా పనిచేస్తుంది. ఇద్దరు పిల్లల తల్లీగా ఉంటూ ఇటుతల్లి పాత్ర అటు మ్యాగజీన్ ఎడిటర్,మరోవైపు సెయింట్ ఇన్స్టిట్యూట్స్ ని చూసుకుంటుంది. అందాల రాక్షసి హీరో రాహుల్ రవీంద్రన్ తన భార్య తన కన్నా ఎక్కువ ఇన్ కం ట్యాక్స్ పే చేస్తుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.ఆమె ఎవరో కాదు గాయని చిన్మయి..ఏం మాయ చేసావ్ సినిమాలో సమంతా కి డబ్బింగ్ చేసింది కూడా ఈమె.