యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో ఒక్కసారిగా నేషనల్ లేవల్లో క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తరువాత ప్రభాస్ పేరు ఇండియా మొత్తం మారుమోగిపోయింది. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సాహో సినిమా కోసం యావత్తు ఇండియా మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది కాని ప్రభాస్ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యుసర్ కరణ్ జోహార్. బాహుబలి సినిమాను బాలీవుడ్‌లో విడుదల చేసింది ఆయనే.
సాహో సినిమా రైట్స్ కూడా ఈయనే తీసుకున్నారని సమాచారం. కరణ్ జోహార్ బాలీవుడ్‌లో ఓ షోని నిర్వహిస్తుంటారు. ఈ షోకి పలువురు సెలబ్రిటీలను పిలిచి వారిని లేని పోని ప్రశ్నలతో ఇరకటంలో పెడుతుంటాడు కరణ్. ఈ షోకి వచ్చి పలువురు సెలబ్రిటీలు ఇబ్బందిపడిన సందర్బాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి షోకి మన సౌత్ నుంచి మొట్ట మొదటి సారిగా హీరో ప్రభాస్ పాల్గొనబోతున్నాడు. ప్రభాస్‌తో పాటు రానా,రాజమౌళిలు కూడా ఈ షోలో పాల్గొనున్నారు. మరి షోతో ప్రభాస్ను ఇబ్బందికరమైన ప్రశ్నలు వేస్తాడో అని ఆయన అభిమానులు అందోళన చెందుతున్నారు. కరణ్ తన షోలో వ్యక్తిగత విషయాలు, ఎఫైర్ల గురించి ఎక్కువుగా అడుగుతుంటాడు. ఇక ప్రభాస్ విషయంలో ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారో చూడాలి.
- అందాల పోటీల కోసం..పేదవారి ఇళ్లు ధ్వంసమా?
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!