రెజీనా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఎందుకనో చెప్పుకోదగ్గ హిట్లు అందుకోలేకపోయింది. సుధీర్ బాబు,గోపిచంద్,సందీప్ కిషన్ వంటి యంగ్ హీరోలతోపాటు రవితేజ వంటి సీనియర్ హీరోలతో నటించిన ఈ భామకు హిట్లు రాలేదు. దీంతో రెజీనాకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. అ వంటి సినిమాలో విభిన్న పాత్రలో నటించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. ఇక కొన్ని సినిమాలలో అందాలు ఆరబోసింది. ఈ సినిమాలు కూడా విజయం సాధించపెట్టలేకపోయాయి. తాజాగా ఈ భామకు ఓ క్రేజీ సినిమాలో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సినిమాలో రెజీనాకు ఆఫర్ వచ్చిందట.
ఏక్ లడఖీ కో దేఖాతో ఐసా లగా సినిమాలో రెజీనాకు ఆఫర్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్‌తో పాటు ఆమె తండ్రి అనిల్ కపూర్ కూడి నటిస్తున్నారు. ఈ సినిమాలో రెజీనా కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో రెజీనా ఓ లెస్బియన్ పాత్రలో కనిపింనుందని టాక్ వినిపిస్తోంది. సోనమ్ కపూర్‌కు ప్రియురాలిగా రెజీనా నటించింది. ఇటీవలే విడుదల అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’