Monday, April 29, 2024
- Advertisement -

బెల్లంకొండ సినిమా లో రేణు దేశాయ్?

- Advertisement -

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం తన తదుపరి సినిమా మీద దృష్టి పెట్టబోతున్నాడు. ఎలాగో ఈ రోజు రాక్షసుడు సినిమా విడుదల కావడం తో ఇక బెల్లంకొండ తన నెక్స్ట్ సినిమా పైన దృష్టి ని సారిస్తాడు. సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా బెల్లంకొండ తన సినిమాలని తను చేసుకుంటూ పోవడం వలన తన మీద ఇండస్ట్రీ లో చాల మంచి పాజిటివ్ టాక్ ఉంది. అయితే ఆసక్తికర విషయం ఏంటి అంటే, బెల్లంకొండ తదుపరి చేయబోయే చిత్రం ఒక బయోపిక్. టైగర్ నాగేశ్వర రావు అనే ఒకప్పటి స్టువర్ట్ పురం దొంగ జీవితం ఆధారం గా ఈ సినిమా తెరకెక్కించబడుతుంది.

ముందు గా ఈ సినిమా ని రానా దగ్గుబాటి తో చేయాల్సి ఉంది కానీ చివరికి దర్శక నిర్మాతలు ఈ సినిమా ని బెల్లంకొండ తో చేయాలి అని నిశ్చయించుకున్నారు. ఒక పీరియడ్ బ్యాక్డ్రాప్ తో ఈ సినిమా ని ప్రేక్షకుల ముందు కు తీసుకొని రానున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఈ సినిమా లో ఒక ముఖ్య పాత్ర కోసం రేణు దేశాయ్ ని అప్రోచ్ అయ్యారట. రేణు కి కూడా పాత్ర నచ్చడం తో ఈ సినిమా చేయాలనే ఆలోచన ని ఎక్స్ప్రెస్ చేసిందట. చివరికి ఇప్పుడు తన స్వీయ దర్శకత్వం లో రానున్న సినిమా నే చేయాలి అని, దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలని, ఈ సినిమా కి దూరం అవుతుంది అని టాక్. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తేలాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -