అకిరా నందన్ చేసిన పనికి భయమేసిందన్న రేణు దేశాయ్.. హీరో అవుతాడనుకుంటే..!

Renu Desai Sensational Comments on Akira Nandan
Renu Desai Sensational Comments on Akira Nandan

పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ బద్రి, జానీ సినిమాల్లో కలిసి నటించారు. బద్రి టైం లో వారిద్దరి మధ్య స్నేహం ప్రేమ ఏర్పడ్డాయి దాంతో రేణు దేశాయ్ ని పెళ్లాడాడు పవన్ కళ్యాణ్. వారిద్దరికి అకిరా నందన్, ఆద్య పిల్లలు ఉన్నారు. పవన్ తో కొన్ని కారణాల వల్ల రేణు దేశాయ్ విడిపోయింది. పవన్ మాత్రం కొడుకు అకిరా నందన్, కూతురు ఆద్యలను ఎప్పుడూ కలుస్తూనే ఉంటాడు. అకిరా నందన్ అయితే అచ్చం పవన్ లానే సూపర్ గా ఉన్నాడు. జూనియర్ పవర్ స్టార్ అతనే అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

అకిరా నందన్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలని పవన్ ఫిక్స్ అయ్యారు. అయితే అకిరా ఇప్పటికే మ్యూజిక్ లో తన టాలెంట్ చూపిస్తున్నాడు. ఇప్పుడు ఫోటో ఎడిటింగ్ లో కూడా తన ప్రతిభ చూపించాడు. అకిరా నందన్ లేటెస్ట్ గా రేణు దేశాయ్ ఒకప్పటి ఫోటోని ఎడిట్ చేశాడు. దాన్ని ఎంతో ప్రేమగా అమ్మకి చూపించాడు. అయితే అకిరా చేసిన ఈ పనికి తాను భయపడ్డానని అంటుంది రేణు దేశాయ్. కొన్ని నిమిషాల్లో ఆ ఫోటోలను ఎడిట్ చేసిన తీరు ఆమెను ఆశ్చర్యపరుస్తున్నాయి.

అకిరా ఎడిట్ చేసిన ఫోటోలను రేణు దేశాయ్ ఇన్ స్టాగ్రాం లో పోస్ట్ చేశారు. రేణు దేశాయ్ ఎడిటెడ్ ఫోటో చూసిన నెటిజన్లు అసలు మిమ్మల్ని గుర్తుపట్టేలా లేరన్నట్టు కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే సీతలా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కి దూరంగా ఉంటున్నా సరే రేణు దేశాయ్ పిల్లల బాధ్యని పవన్ కే అప్పచెప్పినట్టు తెలుస్తుంది. అకిరా నందన్ ని అన్ని విద్యల్లో ప్రావీణ్యం సాధించేలా పవన్ ప్లానింగ్ చేస్తున్నారు.

అకిరా నందన్ వెండితెర ఎంట్రీ కోసం కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫాం లో ఉన్నప్పుడే అకిరా నందన్ ని హీరోగా క్రేజ్ తెచ్చే ప్రయత్నం చేయాలని చూస్తున్నారు. పవన్ అకిరా కలిసి సినిమా చేస్తే చూడాలని ఫ్యాన్స్ కూడా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. పవన్ తో పాటుగా అకిరా కూడా యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా చేయాలని ప్లాన్.

ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బ్రో సినిమాతో ఈ నెల చివరన వస్తుండగా ఈ సినిమా తర్వాత సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఓజీ సినిమా కూడా డిసెంబర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న హరి హర వీరమల్లు సినిమా మాత్రం ఇంకా షూటింగ్ పూర్తి చేయలేదు.