Tuesday, May 7, 2024
- Advertisement -

రేణు దేశాయ్‌ను ప‌చ్చి బూతులు తిట్టిన నెటిజ‌న్‌

- Advertisement -

ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ భార్య , న‌టి రేణు దేశాయ్‌ను సోష‌ల్ మీడియాలో ఓ నెటిజ‌న్ ట్రోల్ చేశాడు. అసభ్యపదజాలంతో రేణు దేశాయ్‌ను దూషించాడు. రేణు దేశాయ్ ఇటీవ‌ల రైతుల కోసం క‌ర్నూలు జిల్లా ఓ ప్రొగ్రామ్ చేసిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే. దీనిపై ఆ నెటిజ‌న్ రేణు దేశాయ్‌ను ట్రోల్ చేశాడు. నేను ఒక రైతు కొడుకుని, గ‌త 20 సంవ‌త్స‌రాలుగా నేను , మా నాన్న వ్య‌వ‌సాయం చేస్తున్నాం. మీరంద‌రు(న‌టీ, న‌టులు) ఇప్ప‌టి వ‌ర‌కు రైతుల కోసం ఏం చేశార‌ని , ఏదో టీవీల ముందు మేక‌ప్ వేసుకుని షో చేయ‌డానికి వ‌చ్చిన మీకు తెలుసు మా బాధాలంటూ ఎఫ్ అంటూ రేణు దేశాయ్‌ను బూతులు తిట్టాడు.

దీనికి గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చింది రేణు దేశాయ్‌. సెలబ్రిటీలను ఎవరు పడితే వాళ్లు ఏది పడితే అది అనొచ్చు అంటూ మండిపడింది. మీరు సెల‌బ్రిటీల‌ను ఎఫ్ అనే ప‌దంతో బూతులు తిట్ట‌వ‌చ్చు కాని, సెల‌బ్రిటీలు మాత్రం ఆ ప‌దం వాడితే పెద్ద త‌ప్పుగా చూస్తారు. అదే పదం ఒక మామూలు మనిషి ఒక సెలబ్రిటీ మీద వాడితే మాత్రం వాళ్లు స్పందించకూడదని అసహనం వ్యక్తం చేసింది. సెలబ్రిటీల‌కు ఎలాంటి ఎమోషన్స్ ఉండ‌వా అంటూ ప్ర‌శ్నించింది రేణు దేశాయ్‌. రైతులకు స‌హయం చేద్దామ‌నుకున్న న‌న్ను దూషించ‌డం దారుణం అని అంటోంది. సెలబ్రిటీలను దూషించడం కోసం కాకుండా ఏదైనా మంచి పని కోసం వాడితే మంచిదని తత‌న‌ను ట్రోల్ చేసిన‌ నెటిజ‌న్‌కు ఓ సూచ‌న కూడా ఇచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -