రేణు దేశాయ్ పవన్ కల్యాణ్‌తో కొంతకాలం సహజీవనం చేసి మరి అతనిని పెళ్లి చేసుకుంది.12 ఏళ్ల వీరి కాపురానికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.ఏమైందో ఏమో తెలియదు కాని సడన్‌గా వీరిద్దరు విడిపోయారు.పవన్ నుంచి విడాకులు తీసుకున్న రేణు దేశాయ్ పుణేలో సెటిల్ అయింది.పిల్లలు కూడా రేణు దేశాయ్ దగ్గరే ఉంటున్నారు.అప్పట్లో తను రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పి పెద్ద సంచలనమే సృష్టించింది.రేణు దేశాయ్ రెండో పెళ్లిపై పవన్ అభిమానులు ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు.రేణు కూడా వారికి ఏ మాత్రం తగ్గలేదు.తాజాగా తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది రేణు దేశాయ్.
‘డిసంబర్ నెలలో కోయంబత్తూర్ లో ఇషా సెంటర్ కు సంబంధించిన లింగ భైరవీ ఆలయంలో చాలా సింపుల్ గా మా పెళ్లి జరగబోతుంది. మా పెళ్లి తరువాత కోయంబత్తూర్ లోనే ఓ అనాధాశ్రమంలో అన్నదానం చేస్తాం. గతంలో పవన్ ను పెళ్లి చేసుకున్నప్పుడు గ్రాండ్ మెహందీ ఫంక్షన్ చేయాలనుకున్నాం. కానీ దానికి పవన్ అంగీకరించలేదు. ఈ పెళ్లి ద్వారా నాకున్న చిన్న చిన్న కోరికలు తీర్చుకోబోతున్నాను”అంటూ చెప్పుకొచ్చింది. తన రెండో పెళ్లిని తన పిల్లలు ఇద్దరు అంగీకరించారని చెప్పుకొచ్చింది.
- 2,196 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- ఆపరేషన్ సింధూర్.. దేశ పరిరక్షణకు ప్రతీక
- ఉగ్రవాది మసూద్ అజర్‌కి అదిరే దెబ్బ
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!