సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఈయన ఏం చేసిన ఓ సంచలనమే అవుతోంది. ఆయన ఏ టైంలో ఏ సినిమా చేస్తారో ఎవరికి తెలియదు.. ఏ ప్రశ్నకు ఏం సమాధనం చెప్తారో తెలియదు.. ఆయన ఏ టైం ఎక్కడ ఉంటారో తెలియదు. ఏది ఏమైన ఆయన ఏమ్ చేసిన దానికి ఓ ప్రత్యేకత తీసుకొస్తారు. ప్రస్తుతం ఆయన ‘లక్మిస్ ఎన్టీఆర్’ అనే సినిమాని తెరక్కెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.
అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. టీడీపీ నేతలు ఎక్కువగా నన్ను విమర్శిస్తున్నారని చెప్పిన వర్మ.. వారి విమర్శలు నాకు మంచి ఎంటర్టైన్మెంట్ ను ఇస్తున్నాయని చెప్పారు. ఇక మూవీలో ఎన్టీఆర్ పాత్ర ఎవరు చేయబోతున్నారనే విషయంపై వర్మ మాట్లాడారు. మూవీలో ఆ పాత్ర కోసం ఆల్ రెడీ సరైన వారినే సెలక్ట్ చేశాను. అతనికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతోంది. అయితే ఎవరిని ఎలా చూపిస్తున్నాను అనే విషయం ఇప్పుడే చెప్పనని వర్మ చెప్పారు. అలానే మూవీలో గ్లామర్ గా చూపించడం లేదని.. అయినా ఆ మూవీలో అలా చూపించడం కూడా కరెక్ట్ కాదని వర్మ తెలిపారు.
అయితే ఆ పాత్ర ఎవరు చేస్తున్నారన్న దాని గురించి మాత్రం వర్మ చెప్పలేదు. మూవీ తీసిన తర్వాత.. నన్ను గుడ్ అనుకునేవారు.. నా వ్యూలో ఈ సినిమా చూసి గుడ్ అంటారు. నేను నచ్చని వారు ఈ సినిమా చూసి బ్యాడ్ అనుకుంటారు అని వర్మ తెలిపారు. అదే విధంగా సినిమా తెరకెక్కించడానికి ఎవరి దగ్గర కూడా సమాచారం తీసుకోలేదని.. తాను తీసుకున్న సోర్సు ప్రకారం మూవీ తీస్తానని వర్మ తెలిపారు.