Tuesday, May 7, 2024
- Advertisement -

హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ.. ఇక సినిమాలకు గుడ్ బై..!

- Advertisement -

లీడర్ మూవీతో హీరోయిన్ గా పరిచయం అయింది బెంగాలీ భామ రిచా గంగోపాధ్యాయ. ఆ తర్వాత మిరపకాయ్, మిర్చి సినిమాలతో సూపర్ సినిమాలు చేసింది. ఈ భామ టాలీవుడ్‍తో పాటు కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సరసన నటించింది. అయితే ఈమె కొన్నాళ్ల కిందట ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

హీరోయిన్ గా మంచి క్రేజ్ ఉన్నప్పుడే సినిమాలకు విరామం ఇచ్చి.. చదువు కోసం యుఎస్ వెళ్లింది. అయితే చదువు అయిపోగానే ఆమె మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఎస్తుందని అంత అనుకున్నారు. కానీ రిచా గంగోపాధ్యాయ ఈ విషయంపై పూర్తిగా క్లారిటీ ఇచ్చేసింది. తాను సినిమాల్లోకి తిరిగి వచ్చే అవకాశం అసలు లేదని తేల్చి చెప్పేసింది. కొన్ని రోజుల కిందటే యుఎస్ లో తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన రిచా.. సినిమాల్లోకి రీఎంట్రీ గురించి తననుఅడుగుతున్న్ అభిమానులకు జవాబు ఇచ్చింది. ఇకపైనా తాను సినిమాలు చేయనని.. నటనకు కంప్లీట్ గా గుడ్ బై చెబుతున్నానని.. త్వరలోనే కొత్త లైఫ్ ఆరంభించబోతున్నానని తెలిపింది రిచా.

దీన్ని బట్టి చూస్తుంటే ఆమె పెళ్లికి రెడీ అవుత్నట్లు తెలుస్తోంది. మంచి చదువు చదివింది కాబట్టి ఉద్యోగం చేసుకుంటూ.. పెళ్లి చేసుకుని యుఎస్‌లోనే ఆమె సెటిలైపోయే అవకాశాలున్నాయి.ఇలా హీరోయిన్‌గా మంచి స్థాయిలో ఉండగా.. సినిమాలకు గుడ్ బై చెప్పేసి చదువు మీద దృష్టి పెట్టి.. ఆ తర్వాత కూడా గ్లామర్ ఫీల్డ్ పట్ల ఆసక్తి ప్రదర్శించకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -