- Advertisement -

‘టాక్సిక్’ క్రేజీ స్పెషల్ వీడియో రిలీజ్..

- Advertisement -

సండల్‌వుడ్ ఇండస్ట్రీని దాటి గ్లోబల్ రేంజ్‌లో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన ‘కె.జి.యఫ్’ స్టార్, రాకింగ్ స్టార్ యష్ (Yash) హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘టాక్సిక్’ (TOXIC) – A Fairy Tale for Grown-ups. జాతీయ అవార్డు గ్రహీత, మలయాళీ ప్రముఖ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ (Geetu Mohandas) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా.. నేడు (జూన్ 8) దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ పుట్టినరోజు (Birthday) సందర్భంగా ‘టాక్సిక్’ చిత్ర బృందం ప్రేక్షకులకు ఒక అదిరిపోయే సర్ప్రైజ్ ఇస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక క్రేజీ స్పెషల్ మేకింగ్ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేసింది.

ఈ ప్రత్యేక వీడియోలో దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్న దృశ్యాలు, సెట్స్‌లో ఆమె వర్కింగ్ స్టైల్ రాకింగ్ స్టార్ యష్ లుక్‌కు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ రా అండ్ రస్టిక్ షాట్స్‌ను మేకర్స్ అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. “మా విజనరీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. వెండితెరపై ఒక సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించడానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.” అంటూ చిత్ర నిర్మాణ సంస్థలైన కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ అఫీషియల్ హ్యాండిల్స్ ద్వారా ఈ వీడియోను షేర్ చేశాయి.

గోవా బ్యాక్‌డ్రాప్‌లో డ్రగ్ మాఫియా, ఇంటర్నేషనల్ కార్టెల్స్ నేపథ్యంలో సాగే ఒక పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా ఒక మైండ్ బ్లోయింగ్ ఫేరీ టేల్ తరహా నరేషన్ ఈ చిత్రంలో ఉండబోతోందని డైరెక్టర్ ముందే క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కరీనా కపూర్ ఖాన్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా.. కియారా అద్వానీ హీరోయిన్‌గా స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. శృతిహాసన్ కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ రోజు విడుదలైన స్పెషల్ బర్త్‌డే వీడియోతో సినిమా మేకింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉండబోతున్నాయో హింట్ ఇచ్చేయడంతో బాక్సాఫీస్ వద్ద రాకింగ్ స్టార్ యష్ ఎలాంటి విధ్వంసం సృష్టించబోతున్నాడో అని సినిమా లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -