బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ రెండోసారి గర్భం దాల్చినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనికి సాక్ష్యం అన్నట్లుగా ఆమె ఫోటోని ఒకటి మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ ఫోటోలో కరీనా పొట్ట దగ్గర కాస్తా లావుగా కనిపించింది. దీంతో ఆమె గర్భవతి అయింది అని ప్రచారం మొదలుపెట్టారు. అసలు మ్యాటర్ ఏంటంటే ఆమె గర్భం దాల్చలేదట.కరీనా కొత్తగా నటిస్తున్న సినిమాలో సరొగసి పాత్ర పోషిస్తుందట.
దాని కోసమే కాస్తా లావుగా మారిందట ఈ భామ. కరీనా లావుగా కనిపించడంతో ఆమె రెండోసారి తల్లి కాబోతుందని రూమర్స్ పుట్టుకొచ్చాయి. కరీనా ,బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి తైముర్ అనే బాబు కూడా ఉన్నాడు. సైఫ్ అలీ ఖాన్‌కు కరీనా రెండో భార్య. సైప్ అంతకముందు వేరే పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్య కూతురు సారా అలీ ఖాన్ ఇటీవలే బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
- Advertisement -
రెండోసారి గర్భం దాల్చిన స్టార్ హీరోయిన్..?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -