- Advertisement -

ఆ వార్తల్లో నిజం లేదు..అన్ని పుకార్లే!

- Advertisement -

ధురంధర్ 2 సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్న నటి సారా అర్జున్ గురించి సోషల్ మీడియాలో ఇటీవల పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఏక్తా కపూర్ నిర్మిస్తున్న “హీర్ రాంఝా” సినిమాలో, ఇమ్తియాజ్ అలీ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌లో సారా అర్జున్ హీరోయిన్‌గా నటిస్తున్నారని వార్తలు విస్తృతంగా ప్రచారం అయ్యాయి.

అయితే ఈ వార్తలను కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛబ్బ్రా అధికారికంగా ఖండించారు. ఈ విషయంపై ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ…సారా అర్జున్ ఇప్పటివరకు మరే కొత్త సినిమాకు సంతకం చేయలేదు. ప్రస్తుతం మేమంతా ధురంధర్ 2 సినిమా కోసం మాత్రమే ఎదురుచూస్తున్నాం. ఆమె ఎలాంటి కొత్త ప్రాజెక్ట్‌పై కూడా ఎవ్వరిని కలవలేదు. కాబట్టి దయచేసి ఆందోళన పడకండి. ఆమె తదుపరి ప్రాజెక్ట్ గురించి నేనే స్వయంగా తెలియజేస్తాను. ఇప్పుడున్న మిగతా వార్తలన్నీ కేవలం పుకార్లే అని తెలిపారు.

ఇదిలా ఉండగా దర్శకుడు ఆదిత్య ధర్, ధురంధర్ 2 సినిమాలో సారా అర్జున్ పాత్ర కథలో కీలకంగా ఉండబోతుందని, ఆమె అసలైన శక్తిని ఆ పాత్రలో ప్రేక్షకులు చూడబోతున్నారని సూచించారు.

మరోవైపు సారా అర్జున్ ఇటీవల నటించిన తెలుగు సినిమా “యూఫోరియా” త్వరలో ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -